శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 29 అక్టోబరు 2015 (13:41 IST)

'బాహుబలి' గ్రాఫిక్స్ హెడ్ ఎలిమినేట్... 'రోబో 2'కి క్సెరాక్స్‌లా ఉంటాయనా...?

బాహుబలి చిత్రం గ్రాఫిక్స్ వర్క్ ఎంతటి మాయ చేశాయో వేరే చెప్పక్కర్లేదు. సెలయేళ్లు, మంచు పర్వతాలు, ఆకాశాన్ని చూసే కొండలు అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే. అలాంటి మాయలు చేసి రాజమౌళి బాహుబలి చిత్రంలో చూడముచ్చట గ్రాఫిక్స్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్గా పనిచేసిన శ్రీనివాస్ మోహన్ బాహుబలి 2 నుంచి దర్శక సంచలనం రాజమౌళి ఎలిమినేట్ చేశారు. ఆయన స్థానంలో మగధీర సినిమాకు అత్యుత్తమ గ్రాఫిక్స్ అందించి జాతీయ అవార్డ్ సాధించిన ఆర్ సి కమల్ కణ్ణన్ను తీసుకున్నట్లు సమాచారం. 
 
కాగా శ్రీనివాస్ ప్రస్తుతం రోబో 2 చిత్రం గ్రాఫిక్స్ పనిలో ముమ్మరంగా ఉన్నారు. ఇదే సమయంలో బాహుబలి కంక్లూజన్ ప్రి-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దక్షిణాదిలో రోబో 2 వర్సెస్ బాహుబలి 2 అనే టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో బాహుబలి గ్రాఫిక్స్ మరింత భారీగా చేయాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలకు గ్రాఫిక్స్ చేసేది ఒకే వ్యక్తి అయితే గ్రాఫిక్స్ క్సెరాక్స్‌లా ఉంటాయనే అనుమానంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అనుకుంటున్నారు.