గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (13:47 IST)

ఎన్టీఆర్‌ని చూసి గర్వంతో ఉప్పొంగిపోతున్నాను: రాజమౌళి

హీరో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

హీరో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం ఆరంభంలో నెగెటివ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం విడుదలైన థియేటర్లు జై నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ఈ చిత్రంలో హీరో నటనకు అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిపోతున్నారు.
 
"బాహుబలి" సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తాడు. తార‌క్‌.. నా హృదయం అపారమైన గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఎన్టీఆర్ నటనకి పదాలు లేవు.. జై జై అంటూ జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 'యమదొంగ' చిత్రం తెరకెక్కగా, ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌ని పవర్‌ఫుల్ రోల్‌లో చూపించిన సంగతి తెలిసిందే.