శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (11:24 IST)

రాజమౌళితో సినిమా... లుక్ కోసం ఎన్టీఆర్ కసరత్తులు..

కథను ఎన్టీఆర్, చెర్రీ ఇద్దరూ ఓకే చేయడంతో ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడట దర్శకధీరుడు రాజమౌళి.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. కథను ఎన్టీఆర్, చెర్రీ ఇద్దరూ ఓకే చేయడంతో ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడట దర్శకధీరుడు రాజమౌళి.


అయితే రాజమౌళి గత చిత్రాల మాదిరిగా గ్రాఫిక్స్ లేకుండా కథాబలంతో నడిచే చిత్రంగా ఈ మల్టీస్టారర్ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2019 వేసవి నాటికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నేపథ్యంలో అరవింద సమేత సినిమాతో హిట్ కొట్టిన ఎన్టీఆర్.. దసరా కానుకగా హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈ సినిమా కోసం నాన్ స్టాప్‌గా పనిచేసిన ఎన్టీఆర్, నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవచ్చనే టాక్ వచ్చింది. కానీ ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోకుండానే.. రాజమౌళి సినిమా పనుల్లో మునిగిపోవాలనుకుంటున్నట్లు తెలిసింది. 
 
అంతేకాదు.. రాజమౌళితో సినిమా చేయనున్న ఎన్టీఆర్.., ఆ సినిమాలో తన లుక్‌కి సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. శారీరక పరమైన కసరత్తుల విషయంలో 45 రోజుల పాటు కఠోర శిక్షణ తీసుకోనున్నాడని చెబుతున్నారు. 
 
వచ్చేనెల 15వ తేదీ నుంచి రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తొలి షెడ్యూల్లోనే ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. అందువలన అప్పటికి తాను సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కష్టపడుతున్నాడని సన్నిహితులు అంటున్నారు.