ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి
ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. ఇటీవల గుండెపోటుకు గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన బుధవారం కన్నుమూశారు.
గత ఆగస్టు నెలలో వ్యాయామాలు చేస్తున్న సమయంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను జిమ్ ట్రైనర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్లపై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.