శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (15:58 IST)

"సైరా"లో స్టార్ హీరో కూతురు?

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న సినిమా 'సైరా నరసింహా రెడ్డి'లో శ్రుతి హాసన్ నటించనుందా? అనే ప్రశ్న ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. 'బాహుబలి' సినిమా తర్వాత అంతటి అంచనాలతో విడుదల అవుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటుగా తమిళం, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. 
 
చిరంజీవి నటిస్తున్న 151 సినిమా అయిన 'సైరా'లో పలు ఇండస్ట్రీల నుండి ప్రముఖులు నటిస్తున్నారు. బాలీవుడ్ నుండి అమితాబ్, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో చిరంజీవికి జోడీగా రాణి పాత్రలో నయనతార కనిపించనుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించి మెప్పించనున్నారు. 
 
మరో ముఖ్య పాత్రలో నటింపజేయడానికి శ్రుతి హాసన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయంట. దక్షిణాదిలో ప్రస్తుతం శ్రుతికి సినిమాలు ఏవీ లేవు. బాలీవుడ్‌లో సినిమాలు, బుల్లితెర షోలు చేస్తోంది. ఇక తనకు ప్రవేశం ఉన్న, బాగా ఇష్టమైన మ్యూజిక్ ఫీల్డ్‌లో ఆల్బమ్‌లు చేసుకుంటూ బిజీగా ఉంది. మరి 'సైరా'లో కనిపించడానికి సై అంటుందో లేదో వేచి చూడాలి మరి!.