చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్‌కు పొగరు తలకెక్కిందా?
విజయ్ దేవరకొండ నటించిన ''అర్జున్ రెడ్డి'' సినిమా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరో, చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటిస్తున్న
విజయ్ దేవరకొండ నటించిన ''అర్జున్ రెడ్డి'' సినిమా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరో, చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటిస్తున్నాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాది హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ చెన్నైలోని ఓ రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. మద్యం తాగి కారు నడిపినట్లు తెలుస్తోంది.
అంతే.. మితిమీరిన వేగంతో కారును అదుపు చేయలేక ఓ ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ధ్రువ్ నడిపిన కారును స్వాధీనం చేసుకున్న పాండీ బజార్ పోలీసులు, ధ్రువ్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నామని తెలిపారు.
ఇప్పటికే ప్రముఖ దర్శకుడు బాల డైరక్షన్‌లో ధ్రువ్ ఓ సినిమా చేస్తున్నాడు. అంతేగాకుండా తెలుగులో హిట్టైన అర్జున్ రెడ్డి రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇంతలో పొగరు తలకెక్కిందో ఏమో కానీ స్నేహితులతో కలిసి కారులో వెళ్లిన ధ్రువ్.. తేనాంపేటలోని అతని ఇంటికి చేరుకుంటున్న సమయంలో ఆటోను ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన ఆటో డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.