గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 29 మే 2017 (12:14 IST)

త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్, పవర్ స్టార్‌తో 'బాహుబలి తాత'ను తీస్తా... టి.సుబ్బరామిరెడ్డి

కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి తను అనుకున్న ప్రాజెక్టు తెరకెక్కించేవరకూ నిద్రపోయేది లేదని తేల్చి చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోలుగా తెలుగు సినిమాల్లోనే ఓ గొప్పను తీయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర

కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి తను అనుకున్న ప్రాజెక్టు తెరకెక్కించేవరకూ నిద్రపోయేది లేదని తేల్చి చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోలుగా తెలుగు సినిమాల్లోనే ఓ గొప్పను తీయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు.
 
ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరూ వారివారి ప్రాజెక్టుల్లో బిజీగా వున్నారనీ, వారి ప్రాజెక్టులు పూర్తి కాగానే వెంటనే తన ప్రాజెక్టు మొదలవుతుందని చెప్పారు. మెగాస్టార్, పవర్ స్టార్ కాంబినేషన్ చిత్రం ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలోనే ఓ బిగ్గెస్ట్ చిత్రమవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కొందరైతే త్రివిక్రమ్, మెగాస్టార్, పవర్ స్టార్ కాంబినేషన్ చిత్రం అంటే అది ఖచ్చితంగా బాహుబలి తాతలా వుంటుందని అంటున్నారు. చూడాలి.. ఆ చిత్రం ఎలా వుంటుందో?