శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (11:21 IST)

కరెంట్ షాక్‌తో ఫైటర్ మృతి - ఎక్కడ?

కన్నడ చిత్ర సీమలో విషాదం జరిగింది. కరెంట్ షాక్‌తో ఫైటర్ ఒకరు మృతి చెందారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. తాజాగా ‘లవ్‌ యూ రచ్చు’ చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా కరెంట్‌ షాక్‌ తగిలి సహాయ ఫైటర్‌ మృతి చెందాడు. మృతుడిని తమిళనాడుకు చెందిన వివేక్‌ (28)గా గుర్తించారు. 
 
కర్నాటక రాష్ట్రంలోని రామనగర తాలూకా జోగనదొడ్డి వద్ద షూటింగ్‌ చేస్తుండగా కరెంట్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు సహాయకులు గాయపడ్డారు.
 
గాయ‌ప‌డ్డ వారిని బెంగ‌ళూరులోని ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ ప్ర‌మాదంపై దర్శకుడు శంకర్‌రాజ్, నిర్మాత గురుదేశ్‌పాండె, ఫైట్‌ మాస్టర్‌ వినోద్‌లను బిడిది పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. 
 
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. షూటింగ్‌లకు సంబంధించిన కొన్ని నిబంధనలను ప్రభుత్వం త్వరలో జారీ చేస్తుందని చెప్పారు.