Widgets Magazine

పూరీ అన్నయ్యా నేను మీకు ద్రోహం చేశాను క్షమించండి. విలపించిన సుబ్బరాజు

హైదరాబాద్, గురువారం, 27 జులై 2017 (08:12 IST)

subbaraju

టాలీవుడ్‌ని కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్‌లో పూరీ జగన్నాధ్‌కి సన్నిహితులుగా ఉన్నవారే ఎక్కువగా ఉన్నారన వేరే చెప్పనవసరం లేదు. అందుకే  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కెల్విన్‌తో మీకు ఏంటి సంబంధం అని  సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే పూరీ జగన్నాథ్‌తో మీకున్న సంబంధం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో కెల్విన్ తర్వాత పూరీ జగన్నాథే టార్గెట్‌గా విచారణ సాగుతోందని అర్థమవుతోంది. 
 
ఇదిలా ఉండగా ఈ కేసులో పూరీ జగన్నాథ్‌కు ఉన్న లింకులను మరింతగా బయటపెట్టింది సుబ్బరాజేనని తెలుస్తోంది. అధికారులు తమదైన శైలిలో విషయాలను రాబట్టడంతో పూర్తిగా ఇరుక్కుపోయే సాక్ష్యాలను సుబ్బరాజు బయటపెట్టెశాడట. అర్థరాత్రి సమయంలో సుబ్బరాజు ఈ వివరాలను చెప్పినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. 
 
మరోవైపున పూరీ జగన్నాథ్‌కి చెందిన లింకులను సిట్ ముందు లీక్ చేయడం వల్ల తాను ఆయనకు ద్రోహం చేశానని సుబ్బరాజు కుమిలిపోతున్నాడట. విచారణకు హాజరైన మరునాడు పూరీ జగన్నాథ్‌కు ఫోన్ చేసిన సుబ్బరాజు పూరీతో మాట్లాడాడట. 
 
"అన్నయ్యా ఈ స్థాయిలో నేనుండటానికి కారణం మీరే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. చిన్న పాత్రలు మొదలుకుని మెయిన్ విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లో నా స్థాయిని పెంచారు. అలాంటి మీ గురించి సిట్ అధికారులకు కొన్ని వివరాలు చెప్పాల్సి వచ్చింది. నేను కావాలని చెప్పలేదు. పరిస్థితులు నాతో అలా చేయించాయి. వారికి నేను ఏయే విషయాలు తెలిపాన్నది మీకు చెప్పలేను. నాకారణంగా మీకు ఈ కేసులో మరిన్ని ఇబ్బందులు తప్పవేమో.. నన్ను క్షమించండి. అందుకే మీకు నా ముఖం కూడా  ఇకపై మీకు చూపించదని నిర్ణయించుకున్నాను" అంటూ ఏడ్చినంత పనిచేశాడట సుబ్బరాజు.
 
అయితే సుబ్బరాజును పూరీ జగన్నాథ్ ఏమీ అనలేదని అతడి సన్నిహితులు వివరించారు. ప్రస్తుతం మన టైమ్ సరిగా లేదని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని సుబ్బరాజును ఓదార్చిన పూరి ఈ విషయాలేమీ మనసులో పెట్టుకోవద్దని సూచించినట్లు తెలుస్తోంది. 
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎప్పుడు పిలిస్తే అప్పుడు సినిమాకు సైన్ చేయడం ఎలా... సాహోనుంచి వైదొలిగిన అనుష్క

మొత్తం మీద సాహో సినిమాలో అనుష్క నటించడం లేదని తేలిపోయింది. కారణం రెమ్యునరేషన్ కుదరక ...

news

డ్రగ్స్ కేసు... రవితేజ విచారణ తేదీని ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు?(వీడియో)

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో నిందితుడు అరెస్టవుతున్నాడు. ఇప్పటివరకూ 20 మందిని అరెస్టు ...

news

'ఫిదా' ఎందుకు హిట్టయ్యిందో తెలుసా?

చాలాకాలంగా ఒకే మూస ధోరణిలో సినిమాలకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడు తమ అభిరుచిని ...

news

చార్మి 'జ్యోతిలక్ష్మి' ఏం చెప్పింది... డ్రగ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌లో వెలుగు చూసిన మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి చార్మీ వద్ద ...