బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (18:56 IST)

దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా వున్నా.. రష్మీనే కౌగిలించుకుంటా..?

బుల్లితెరపై రష్మీ గౌతమ్‌కు, సుడిగాలి సుధీర్‌కు మంచి క్రేజ్ వుంది. ఈ జంట తెరపై కనిపిస్తే చాలు కొంత మంది అభిమానులు ఖుషీ అవుతారు.. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో.. తాజాగా రష్మీ గౌతమ్ గురించి సుడిగాలి సుధీర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 
 
అలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అలీతో సరదాగా కార్యక్రమంలో గెస్ట్‌గా సుధీర్ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా అలీ వేసిన ఓ ఆసక్తికర ప్రశ్నకు షాకిచ్చే సమాధానం ఇచ్చాడు సుధీర్. దీపిక పదుకొనే లేదా ప్రియాంక చోప్రాల్లో ఎవరిని కౌగిలించుకుంటావని ప్రశ్నించగా.. రష్మీ గౌతమ్ ఎక్కడా అని అడుగుతానని చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. 
 
ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి అడగ్గా.. ఏడేళ్ల ప్రయాణం తమదని వ్యాఖ్యానించాడు. ఈ షోలో తన ప్రేమ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు సుధీర్. తాను ఐదో తరగతిలో ప్రపోజ్ చేయగా.. ఆమె తొమ్మిదో తరగతిలో ఒప్పుకుందని, కానీ ఆమెకు పెళ్లై పోయిందని స్పష్టం చేశాడు.