1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 9 జులై 2025 (15:35 IST)

Sirisha: సుడిగాలి సుధీర్ పెళ్లిచేసుకోడు : ధనరాజ్ భార్య శిరీష స్టేట్ మెంట్

Sirisha, sudigali sudheer
Sirisha, sudigali sudheer
సుడిగాలి సుధీర్ అంటే యూత్ తోపాటు పెద్దలకు తెలిసిన పేరు. జబర్ దస్త్ నుంచి బాగా పాపులర్ అయిన సుదీర్... ధనరాజ్, వేణు మంచి స్నేహితులు. జబర్ దస్త్ కథలు రాసేటప్పుడు మొదట్లో ఏడు ఎపిసోడ్స్ అనుకున్న ప్రోగ్రామ్ కంటెన్యూగా సాగడానికి వారే కారణమట. ఈ విషయాన్ని ఇటీవలే బలగం వేణు కూడా చెప్పాడు. తాజాగా ధనరాజ్ భార్య శిరీష కూడా వెల్లడించింది. రూమ్ లో కథల చర్చల్లో వుండగా అరుపులు కేకలే. ఒక్కోసారి కొట్టుకునేంతగా మారతారు. చూసేవారికి కొట్టుకుంటున్నట్లుంటుంది. కానీ కాసేపటికి సరదాగా బయటకు వస్తారు.
 
శిరీష్ తన భర్త ధనరాజ్ కు చేదోడువాదోడుగా వుండేందుకు ఈవెంట్ మేనేజర్ గా పలు ప్రోగ్రామ్ లు చేస్తుంటుంది. ఇక సుధీర్ తనను వదిన అని పిలిచేవాడు. కుటుంబసభ్యుల్లా వుండేవాళ్లం. తనూ ముక్కుసూటి మనిషి. ఏదైనా మొహం మీద చెప్పేస్తాడు. మరి వదినగా మీరు సుధీర్ కు ఎప్పుడు పెండ్లి చేస్తారనే ఓ ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ, సుధీర్ ఇప్పుడు మాత్రం పెండ్లి చేసుకోడు. ఎందుకంటే తను పెండ్లయ్యాక బంధీ అయ్యేపోతాడమేమోనని సందిగ్థంలో వుంటుంటాడు. అలా వుండడం అతనికి ఇష్టం వుండదు. నాకు తెలిసి ఇప్పుడు వివాహం చేసుకోడు. భవిష్యత్ లో ఏదైనా మిరాకిల్ జరిగితే చెప్పలేం అంటూ క్లారిటీ ఇచ్చింది.