గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (22:35 IST)

షారూఖ్ ఖాన్ కుమార్తెతో బిగ్ మనవడి ప్రేమాయణం.. ఫ్లయింగ్ కిస్ ఇస్తూ..? (video)

Suhana Khan-Agastya Nanda
Suhana Khan-Agastya Nanda
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ కొడుకు అగస్త్య, షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన మరో వీడియో వైరల్‌గా మారింది. 
  
బచ్చన్‌, షారుఖ్‌లు కలిసి బాలీవుడ్‌లో కూడా హిట్‌ చిత్రాలను అందించారు. అయితే ఈ కుటుంబాలు సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్‌లో బంధువులుగా మారనున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం ఏంటంటే.. ఈ ఇరు కుటుంబాలకు చెందిన స్టార్ కిడ్స్ ప్రస్తుతం ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
 
అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ కొడుకు అగస్త్య, షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ బర్త్ డే పార్టీలో అగస్త్య, సుహాన్ ఖాన్ కలిసి కనిపించారు. అంతే కాకుండా పార్టీని వీడుతున్న సమయంలో సుహాన్ ఖాన్ అగస్త్య‌తో దిగిన ఓ వీడియో వైరల్‌గా మారింది. 
 
సుహాన పార్టీ నుంచి వెళ్తున్న వేళ కారులో ఎక్కుతుండగా  ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు అగస్త్య. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇద్దరు స్టార్ కిడ్స్ డేటింగ్ పుకార్లకు మరింత మద్దతునిచ్చింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @varindertchawla