Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళ గర్వాన్ని తొక్కిపడేసిన బాహుబలి-2. ఇప్పుడు బరిలో శాతకర్ణి

హైదరాబాద్, గురువారం, 1 జూన్ 2017 (08:48 IST)

Widgets Magazine

దక్షిణాదికే కాదు ఉత్తర భారత దేశానికి కూడా సినిమా ఎలా తీయాలో నేర్పించింది, నేర్పిస్తున్నది, ఇకపై నేర్పేది కూడా మేమే అనేంత గర్వం ఇటీవలివరకూ తమిళ చిత్రసీమలో రాజ్యమేలేది. ఈ గర్వం ఏ స్థాయికి వెళ్లిందంటే తెలుగు సినీపరిశ్రమకు ఎక్స్ ‌ట్రా నటులను, డ్యాన్సర్లను కూడా మేమే సప్లయ్ చేయాలి అని ప్రకటించుకునే స్థాయికి వెళ్లింది. 
తమిళ ప్రైడ్ అని చెప్పుకుంటున్న ఆ గర్వాన్ని బాహుబలి 2 చీల్చి పడేసింది.
gau


తమిళనాడులో ఒక తెలుగు దర్శకుడు తీసిన చిత్రం అక్కడి స్ట్రెయిట్ చిత్రాల రికార్డులను కుళ్లబొడిచేసింది. రోబో రికార్డులను బద్దలు చేసింది. తమిళనాడు చరిత్రలోనే వంద కోట్లకు పైగా వసూలు చేసిన తొలి చిత్రంగా బాహుబలి 2 చరిత్ర సృష్టించింది. తెలుగు వాళ్లు ఇంత గొప్పగా కాల్పనిక చిత్రాన్ని తీయగలరా అంటూ సినిమా చూస్తూ గిల్లి మరీ చూసుకున్న తమిళ చిత్రపరిశ్రమ ప్రముఖులు, బాహుబలి 2కి తమిళనాడులో ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూసి బిత్తరపోతున్నారు. 
 
ఇన్నాళ్లుగా తెలుగు చిత్రాల విడుదలను కట్టడి చేసి తెలుగు చిత్రాల డబ్బింగును కూడూ అడ్డుకుంటూ ఆధిపత్యం చలాయించిన తమిళ చిత్రపరిశ్రమ బాహుబలి దెబ్బతో తెలుగు చిత్రాల డబ్బింగుకు తలుపులు తెరిచేసింది.
 
ఆ కోవలో తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ సినీ నట జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయిన శాతకర్ణి  సినిమాను ఇప్పుడు తమిళంలోకి డబ్ చేస్తున్నట్లు తెలిసింది.
 
బాలకృష్ణ నటన విశ్వరూపాన్ని మరోసారి వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో అనువాదమవుతోంది. సుజాతపుత్ర రఘునాథన్‌ సమర్పణలో సుజాతపుత్ర నరేంద్ర తమిళంలో చేయనున్నారు. ‘‘బాహుబలి–2’ తర్వాత తమిళంలో తెలుగు చిత్రాలపై క్రేజ్‌ నెలకొంది.
 
ఈ నేపథ్యంలో ‘గౌతమిపుత్ర కర్ణి’శాతకర్ణి’కి అక్కడ క్రేజ్‌ ఉండటంతో తమిళంలో విడుదల చేస్తున్నాం. ఆడియోను, సినిమాను ఈ నెలలోనే విడుదల చేయబోతున్నాం’’ అని సుజాతపుత్ర నరేంద్ర అన్నారు. ఈ చిత్రానికి మాటలు–పాటలు మరుదు భరణి, వైరముత్తు.
 
ఇన్నాళ్లకు తమిళ గడ్డపై తెలుగు చిత్రాలకు గౌరవం లభిస్తున్నదంటే అది బాహుబలి 2 చిత్రం ఘనతే అని చెప్పాలి. త్వరలో విడుదల అవుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా తమిళసీమలో ప్రభంజనం సృష్టిస్తుందని, చారిత్రక కథాకథనంపై తెలుగువారికి ఉన్న పట్టును నిరూపిస్తుందని ఆశిద్దాం..
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
బాలకృష్ణ ‘శాతకర్ణి’ క్రిష్‌ తమిళం విడుదల తెలుగు చిత్రాలు క్రేజ్ Balakrishna 'shatakarni' Chrish

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆదిలోనే హంసపాదు.. సంఘమిత్రకు నిజంగానే బాహుబలి స్థాయి ఉందా?

ఇదేమిటి ఈ విచిత్రం. బాహుబలిని మించిన సినిమా అంటూ తమిళ చిత్ర పరిశ్రమ ఘనంగా బాకాలూదిన ...

news

విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సన్నీ ఎలా వణికిందంటే..

విమాన ప్రమాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పైలట్ ప్రావీణ్యంతో బయటపడి పెను ...

news

రాజమౌళిని చెడుగుడు ఆడుకుంటున్న నెటిజన్లు... ఎందుకని?

రాజమౌళి అంటే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతటి పేరుందో వేరే చెప్పక్కర్లేదు. వివాదాలకు ...

news

నా భార్య గర్భవతి కాలేదని నా బిడ్డకు తండ్రి అవుతావా?: రజనీపై భారతీ రాజా బూతు కామెంట్లు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం ఎక్కవని, కెమెరాలు ఎక్కడుంటే ...

Widgets Magazine