బిగ్ బాస్ హౌస్ నుంచి సుజాత ఔట్, మనస్సులో అంత దాచుకుందా?

Nagarjuna
జె| Last Modified సోమవారం, 12 అక్టోబరు 2020 (21:56 IST)
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిలో గురించి ఇప్పుడే చర్చ జరుగుతోంది. హౌస్‌లో సుజాత, లాస్య మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చాలారోజులు హౌస్‌లో ఉన్నారు. మంచి స్నేహితులుగా మారారు. అయితే లాస్యను అక్క అని పిలుస్తూ ఉండేదానినని చెప్పింది సుజాత.

తన మనస్సుల్లోని మాటలను బయట పెట్టేసింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదు. అయినా ఫర్వాలేదు. నాకు మంచి కుటుంబం దొరికింది. అందులో హౌస్ సభ్యులు, ముఖ్యంగా లాస్య అక్క ఉంది. నేను ఎప్పుడూ నాగ్ గురించి మాట్లాడుతూ ఉండేదాన్ని.

లాస్య అక్క కూడా అదే చెబుతూ ఉండేది. నాగ్ బాగా అందంగా ఉంటాడు. ఆయన వేసుకునే డ్రస్ ఇంకా చాలా బాగుటుంది. నాగ్ చాలా అందంగాడు అంటూ లాస్య నాతో ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది అంటూ తన మనస్సులోని మాటలను బయట పెట్టేసింది సుజాత.

అయితే హౌస్ లో ఎప్పుడూ కామ్ గా ఉంటూ వచ్చానని...అనవసరంగా ఎందులోను తలదూర్చలేదని..జడ్జ్ గా వ్యవహరించే నాగార్జునతోనే ఓపెన్ అయ్యింది సుజాత. ప్రస్తుతం సుజాత చేసిన ఆశక్తికర వ్యాఖ్యలే పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :