Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నదిలో పడిన సుకుమార్.. ప్రాణాలకు తెగించి కాపాడిన హీరో.. ఎవరు?

ఆదివారం, 30 జులై 2017 (10:37 IST)

Widgets Magazine
sukumar - allu - raju

షూటింగ్ సమయాల్లో వివిధ రకాల ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు మృత్యువాతపడుతుంటే.. మరికొందరు గాయాలతో ప్రాణగండం నుంచి బయపడుతుంటారు. అయితే, టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు సుకుమార్ ఓ ప్రాణగండం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రాణాలు రక్షించింది కూడా ఓ స్టార్ హీరోనే. ఆ హీరో ఎవరో కాదు అల్లు అర్జున్. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సుకుమార్ నిర్మాణంలో "ద‌ర్శ‌కుడు" అనే చిత్రం రూపొంద‌గా ఈ మూవీని ఆగ‌స్ట్ 4న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే శనివారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుక‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఫంక్ష‌న్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుండ‌గా, సుకుమార్ 'ఆర్య' షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. 
 
'ఆర్య' సినిమా షూటింగ్ సమయంలో ప్ర‌మాద‌వ‌శాత్తు తాను పడవలోనుంచి నదిలో పడిపోయానని చెప్పాడు సుకుమార్. నాకు ఈత రాక‌పోగా , నేను ప‌డిపోవ‌డం చూసి అంతా షాక్‌కు గురై అందరూ అలాగే చూస్తుండిపోయారు. ఇక చివ‌రి క్ష‌ణాలు అవే అనుకుంటున్న స‌మ‌యంలో అల్లు అర్జున్ నదిలో దూకి త‌న‌ని ర‌క్షించాడ‌ని గుర్తు చేశాడు. అందుకే ఆయ‌నే నా రియ‌ల్ హీరో అని సుకుమార్ ఉద్వేగ భ‌రితంగా చెప్పాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పదేళ్ల కుర్రాడు.. 18 ఏళ్ల అమ్మాయిని ప్రేమిస్తే?

బాల్య వివాహాలు వద్దని పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో ఓ పదేళ్ల కుర్రాడు...అమ్మాయిని ...

news

''సాహో''లుక్ ఆగస్టు 15న వచ్చేస్తుందట.. ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశాడట..

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుకుంటున్న 'సాహో' ...

news

బాహుబలి 2 కొత్త రికార్డు.. సాహోరే బాహుబలి పాటకు ఐదు కోట్ల వ్యూస్..

ఎన్నో రికార్డులకు చిరునామాగా మారిన బాహుబలి కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ...

news

పీకల్లోతు ప్రేమలో మునిగిన ప్రిన్స్ మహేష్ హీరోయిన్...

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం 'నేనొక్కడినే'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ...

Widgets Magazine