Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'రంగస్థలం' అంటే నాటకం కాదు.. ప్రతి 'పల్లెటూరు' ఓ రంగస్థలమే: సుకుమార్

మంగళవారం, 1 ఆగస్టు 2017 (16:05 IST)

Widgets Magazine
Rangasthalam movie still

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సమంత కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్స్‌ను ప్రకటించినప్పటి నుంచి ఈ చిత్రం రంగస్థల నాటకాల నేపథ్యం ఉంటుందేమోననే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. దీనిపై చిత్ర దర్శకుడు సుకుమార్ తాజాగా వివరణ ఇచ్చాడు. 
 
నాటి రంగస్థల నాటకాలకు.. ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. పట్టణాల్లాగా పల్లెటూళ్లలో ఎవరిగోల వాళ్లదే అన్నట్టుగా ఉండరు. కష్టమొచ్చినా .. నష్టమొచ్చినా అంతా ఒక చోట గుమిగూడతారు. ఏం జరిగిందంటూ తెలుసుకుని తమవంతు సహాయ సహకారాలను అందిస్తారు. అలా వాళ్లందరినీ ఒకేచోట చూసినప్పుడు ఆ ఊరు ఒక వేదికలా కనిపిస్తుంది. ప్రతి పల్లెటూరు ఒక రంగస్థలమే కదా అనిపిస్తుంది. అందువల్లనే పల్లె నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఈ టైటిల్‌ను పెట్టడం జరిగిందని సుకుమార్ వివరణ ఇచ్చారు. కాగా, ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సల్మాన్‌ను వాటేసుకోవడానికి సర్రున బుల్లెట్లా వచ్చిన హీరోయిన్... ఇబ్బందిపడ్డ టైగర్

ప్రస్తుతం ఇపుడు తమిళ, తెలుగు బిగ్ బాస్ షోలు జరుగుతున్నాయి. ఐతే బాలీవుడ్లో ఓ స్థాయిలో బిగ్ ...

news

A ఫర్ యాపిలూ.. B ఫర్ బుజ్జులూ అంటున్న కేథరిన్... (Video)

A అంటే యాపిలూ.. B అంటే బుజ్జులూ అంటోంది నటి కేథరిన్. అందానికి.. ఆకర్షణకు కేరాఫ్ ...

news

'బిగ్ బాస్' వైల్డ్ కార్డ్‌తో కొలనులోకి దీక్షా పంత్... వెర్రి ముఖమేసుకుని శివబాలాజీ

మొత్తానికి ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ తెలుగును కాస్త లైమ్ లైట్లోకి తీసుకువచ్చేందుకు ...

news

చైతూ హీరో.. శ్రీకాంత్ విలన్.. 'యుద్ధం శరణం' టీజర్ రిలీజ్

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య తాజా చిత్తం ‘యుద్ధం శరణం’. ఈ చిత్రంలో మరో సీనియర్ ...

Widgets Magazine