గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (13:54 IST)

సునైనా లేడీ ఓరియంటెడ్ మూవీ రెజీనా

Sunaina
Sunaina
నీర్పరవై-వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులని మెప్పించి, ఇటీవల “సిల్లు కారుపట్టి” అంథాలజీతో మరోసారి నటనతో ఆకట్టుకున్న సునైనా.. 'లేడీ ఓరియంటెడ్ మూవీ 'రెజీనా'తో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చారు. 
 
కోయంబత్తూరుకు చెందిన "ఎల్లో బేర్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పి" బ్యానర్ లో కొత్త నిర్మాత సతీష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. “పైపిన్ చువత్తిలే ప్రణయం', “స్టార్” వంటి చిత్రాలను తెరకెక్కించిన  డొమిన్ డిసిల్వా ఈ చిత్రానికి  దర్శకత్వం వహించారు.
 
 ఈ చిత్రం గురించి దర్శకుడు డిసిల్వా మాట్లాడుతూ.. ఈ చిత్రం ఫిమేల్ సెంట్రిక్ స్టైలిష్ థ్రిల్లర్‌. ''ప్రవాహానికి ఎదురీదే చేపలాగా..  ఒక సాధారణ గృహిణి అసాధారణమైన పని ఎలా సాధించిందనే అంశాన్ని  రెజీనాలో చూస్తారు. రేజీనా ఎంగేజింగ్ థ్రిల్లర్‌'' అని చెప్పారు 
 
సతీష్ నాయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. తన "ఎస్ ఎన్ మ్యూజికల్స్" లేబుల్ ద్వారా గతంలో విడుదల చేసిన సింగిల్స్‌లో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా కోసం సంగీతాన్ని అందించారు. యుగభారతి, వివేక్ వెల్మురుగన్, విజయన్ విన్సెంట్ , ఇజాజ్.ఆర్ పాటలకు సాహిత్యం అందించారు.
 
పవన్ కె పవన్ సినిమాటోగ్రఫీ అందించగా కమరుదిన్ ఆర్ట్ డైరెక్టర్ గా,  టోబి జాన్ ఎడిటర్‌గా ఏగన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా ఈ చిత్రానికి పని చేశారు. తమిళంలో చిత్రీకరించిన ఈ మల్టీలింగ్వల్ హిందీ, మలయాళం, తెలుగులో విడుదల కానుంది.