మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (19:13 IST)

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

sunil shetty
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి షూటింగులో గాయపడ్డారు. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'హంటర్' షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడ ఆయనపై కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదంలో సునీల్ శెట్టి పక్కటెముకలకు తీవ్ర గాయమైనట్లు.. తలకు కూడా స్వల్పంగా దెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. దీంతో షూటింగును నిలిపివేసి సునీల్ శెట్టిని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు చేసిన ప్రాథమిక చికిత్సతో ఆయన కోలుకున్నారు. దీనిపై సునీల్ శెట్టి తన ట్విట్టర్ హ్యండిల్‌‍లో స్పందించారు. గాయం చిన్నదని  ..‌ తదుపరి చిత్రీకరణ కోసం తాను సిద్దంగా ఉన్నట్టు పేర్కొన్నారు.