శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (19:23 IST)

రూటు మార్చిన సునీల్... రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా..?

క‌మెడియ‌న్‌గా కెరీర్ ప్రారంభించి.. ఎన్నో సినిమాల్లో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించి.. క‌థానాయ‌కుడుగా మారి స‌క్స‌స్‌ఫుల్ మూవీస్‌లో న‌టించాడు సునీల్. అయితే...ఇటీవ‌ల హీరోగా న‌టించిన సినిమాల‌న్నీ ఫ్లా

క‌మెడియ‌న్‌గా కెరీర్ ప్రారంభించి.. ఎన్నో సినిమాల్లో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించి.. క‌థానాయ‌కుడుగా మారి స‌క్స‌స్‌ఫుల్ మూవీస్‌లో న‌టించాడు సునీల్. అయితే...ఇటీవ‌ల హీరోగా న‌టించిన సినిమాల‌న్నీ ఫ్లాప్ అవ్వ‌డంతో రూటు మార్చాడు. మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ "అర‌వింద స‌మేత" సినిమాలో న‌టిస్తున్నాడు. త్రివిక్ర‌మ్ సునీల్ ఫ్రెండ్ కాబ‌ట్టి ఈ సినిమాలో పంచ్‌ల‌తో అద‌ర‌గొట్టేస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... మరి సునీల్ రెమ్యునరేషన్ ఎంత? హీరోగా ఉన్నపుడు సినిమాకు ఇంత అనే ప్యాకేజ్‌లా ఉన్న రెమ్యునరేషన్. ఇక‌ ఇప్పుడు రోజువారీ కాల్షీట్‌లకు మారిందట. అయితే... సునీల్ ఒక రోజుకు రూ.3.5 లక్షలు తన రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడని టాక్. ఇప్పుడు సునీల్ దాదాపు అరడజను సినిమాల్లో కామెడీ రోల్స్‌లో కనిపించనున్నాడు. మరి రీ-ఎంట్రీతో క‌మెడియ‌న్‌గా మ‌ళ్లీ బిజీ అవుతాడేమో చూడాలి.