Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చేతి నిండా ఉంగరాలతో సునీల్... సెంటిమెంట్ పండుతుందా?

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (17:12 IST)

Widgets Magazine

అతని పేరు రాంబాబు. నమ్మకాలు ఎక్కువ. నెమ్మదస్తుడు, నమ్మకస్తుడు కూడా. పదిమందికి సాయపడాలనే తత్త్వం అతనిది. చేతినిండా ఉంగరాలు పెట్టుకుని అనుకున్నది సాధించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అలాంటి ఓ సమయంలో అతనికి ఎదురైన పరిస్థితుల్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపిస్తూ.. 'ఉంగరాల రాంబాబు' చిత్రం రూపొందిస్తున్నట్లు దర్శకుడు క్రాంతి మాధవ్‌ తెలియజేస్తున్నాడు. 
 
పరుచూరి ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని హీరో ఎంట్రీ సాంగ్‌ అన్నపూర్ణ ఏడెకరాలలో చిత్రిస్తున్నారు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ.... టైటిల్‌ వింటుంటే ఎంత ఫన్నీగా ఉందో సినిమా ఫస్ట్‌ సీన్‌ నుండి లాస్ట్‌ సీన్‌ వరకు అంతే ఫన్‌ ఉంటుంది. ఒకప్పుడు సీనియర్‌ నటుడు చలంగారి సంబరాల రాంబాబు అనే టైటిల్‌లా ఎంతో బావుందని నా స్నేహితులు కొంతమంది ఫోన్‌ చేశారు. క్రాంతి మాధవ్‌ వంటి మంచి స్ట్రెంగ్త్‌ ఉన్న దర్శకుడితో వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. అప్పట్లో రాజేంద్రప్రసాద్‌గారు చేసిన క్యారెక్టర్స్‌ తరహాలో ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ఉంటుంది. అందాల రాముడు, పూల రంగడు సినిమాల తరహాలో ఎంజాయింగ్‌గా ఉంటుంది. 
 
రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ను కూడా దర్శకుడు క్రాంతి మాధవ్‌ ఓ ఇన్నోవేషన్‌తో కాన్సెప్ట్‌ ప్రకారం ఫస్ట్‌లుక్‌ను తయారు చేశారు. ఓ ఐదారు రోజుల మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఈ రోజు చిత్రీకరణ జరుపుకుంటున్న సాంగ్‌తో సినిమా పాటలన్నీ పూర్తవుతాయి. సినిమాలో ఐదు సాంగ్స్‌ ఉన్నాయి. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ విషయానికి వస్తే హీరో చిన్నపిల్లాడి వంటి మనస్తత్వం ఉండే మంచి వ్యక్తి. జాతకాలను నమ్మే క్యారెక్టర్‌. ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ వంటి సీనియర్‌ నటుడుతో కూడా నటించడం మంచి అనుభవాన్నిచ్చింది. మంచి కామెడితో పాటు సోషల్‌ ఆవేర్‌నెస్‌ ఉన్న చిత్రం. సినిమాలో పాత్ర కోసం ఇంతకుముందు సునీల్‌లా లావుగా కనపడాలని డైరెక్టర్‌గారు అడగడంతో పాత్ర కోసం అలా మెయింటైన్ చేశానన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గ్లామర్‌ గోడకెక్కి తొంగితొంగి చూస్తోంది(ఫోటోలు)

హీరోయిన్లు తమ అందాలను ప్రదర్శిస్తూ పలు క్యాలెండర్లకు ఫోజులిస్తుంటారు. కింగ్‌ ఫిషర్‌ వంటి ...

news

పవర్‌ఫులైన అమ్మ ఆత్మ ఏం చేస్తోంది.. తమిళ దేవుళ్ళు, భక్తులు ఏం చేస్తున్నారు?: వర్మ ప్రశ్న

ప్రముఖ సినీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలిచేందుకు కొత్త అస్త్రాన్ని ...

news

శశి-జయ బంధంలో షాకింగ్ నిజాలు.. జంతువుల కంటే హీనమా? పళని మాఫియా మెంబర్ ఐతే.. శశి డాన్..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శశికళ మీద పడ్డాడు. గతంలో శశికళ జీవిత కథ ఆధారంగా ...

news

సినిమాలు తీస్తానని నమ్మించి.. బ్లాక్ మెయిల్.. సినీ డైరెక్టర్‌పై అత్యాచార కేసు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యువ దర్శకుడిపై అత్యాచారం కేసు నమోదైంది. తాను తీసే ...