Widgets Magazine

సన్నీలియోన్-వెబర్ దంపతులకు కవలలు (ఫోటో చూడండి)

సోమవారం, 5 మార్చి 2018 (12:34 IST)

సెర్చింజన్ గూగుల్‌లో నెటిజన్లు ప్రతి చిన్న విషయం కోసం వెతికేస్తున్నారు. అలాంటిది సెలెబ్రిటీల గురించి గూగుల్‌లో వెతికే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. గూగుల్ ద్వారా వికీపీడియా సెర్చ్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను.. శృంగార తార సన్నీలియోన్ వెనక్కి నెట్టింది. గూగుల్ సెర్చ్‌లో నెటిజన్లు సన్నీ కోసం ఎక్కువ వెతికారనే వికీపీడియా తెలిపింది.
 
గత పదేళ్ల కాలంలో నెటిజన్లు బాలీవుడ్, హాలీవుడ్‌లకు చెందిన ఏ సెలబ్రిటీ కోసం ఎక్కువగా శోధించారనే వివరాలను వికీపీడియా వెల్లడించింది. 2007 నుంచి 2017 మధ్య కాలంలో నెటిజన్లు శోధించిన 32 మంది బాలీవుడ్, హాలీవుడ్ సెలెబ్రిటీల జాబితాలో షారూఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలవగా.. సల్మాన్ ఖాన్‌ (29)ను వెనక్కి నెట్టిన సన్నీలియోన్ 20వ స్థానంలో నిలిచింది.
 
ఇదిలా ఉంటే, సన్నీలియోన్, డానియర్ వెబర్ దంపతులు మళ్లీ తల్లిదండ్రులయ్యారు. సన్నీ దంపతులు ఇప్పటికే 21 నెలల అమ్మాయిని గత ఏడాది దత్తత తీసుకున్నారు. తద్వారా ఇప్పటికే తల్లిదండ్రులైన ఈ జంట.. తాజాగా ఇద్దరు కవల శిశువులను దత్తత తీసుకున్నారు. 
 
అషెర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్ అనే ఇద్దరు కవల సోదరులను సన్నీ దంపతులు దత్తత తీసుకున్నారు. తన పెద్ద కుమార్తె నిషా కౌర్ వెబర్‌, తన ఇద్దరు కవలు, భర్తతో కలిసి తీసిన ఫోటోను సన్నీ లియోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి..


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రజనీకాంత్ #2point0 మేకింగ్ వీడియో (Making of 2.0 VFX Featurette)

సూపర్‌స్టార్ రజనీకాంత్ - డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం "2.O". ఈ ...

news

స్టీవ్ హ్యారీ షో‌లో చిరంజీవి సాంగ్... ఉర్రూతలూగించిన 'సన్నాజాజాలా చుట్టేసిందిరో...' (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150". ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ ...

news

"సైరా" డిజిటల్ రైట్స్ రూ.30 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఏ.సురేందర్ రెడ్డి ...

news

హీరో నితిన్‌కు హీరోయిన్ రాశిఖన్నాకు పెళ్లి...

హీరో నితిన్‌కు హీరోయిన్‌ రాశిఖన్నాకు పెళ్లి జరిగింది. పెళ్లి అంటే నిజమైన పెళ్లి ...

Widgets Magazine