శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (10:31 IST)

ఈ వాలెంటైన్స్ డేని గ్రాండ్‌గా చేసుకుంటాం.. సన్నీ భర్త

బాలీవుడ్ నటి సన్నీలియోన్.. ఆమె భర్త డేనియల్ వెబెర్ ఈసారి కూడా వాలెంటైన్స్ డేని గ్రాండ్ జరుపుకోనున్నారు. మాజీ పోర్న్ స్టార్ సన్నీ, డేనియల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 10 ఏళ్లుగా వారిద్దరూ అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఇతర ప్రేమ జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 
 
ఈసారి ‘వాలెంటైన్స్ డే’కి తమ ప్లాన్ ఏంటో డేనియల్  ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. బిజీ షెడ్యూల్‌లో కూడా ఆ రోజున రొమాంటిక్ డిన్నర్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. ఆ రోజున తాను ఓ పని మీద ఢాకాకు వెళ్తున్నట్లు చెప్పిన డేనియల్ వెబెర్... సాయంత్రానికే ముంబైకి వెనుదిరిగి వస్తానని చెప్పారు. 
 
వాలెంటైన్స్ డే రోజున సగం రోజు సన్నీని మిస్ అవుతానని వెల్లడించారు. అయితే రాత్రి తన ప్రియమైన భార్యను డిన్నర్‌కు తీసుకెళ్తానని తెలిపారు. ఢాకా టూర్‌ని బుక్ చేసుకోవటానికి ముందే సన్నీ నుంచి అప్రూవల్ తీసుకున్నట్లు తెలిపారు.