గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జూన్ 2024 (11:08 IST)

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

sunny leone
నిజానికి హీరో అడవి శేష్ పేరు ఇది కాదు. తన పేరు 'అడివి సన్నీ చంద్ర'. అయితే తన పేరు మార్చుకోవడానికి సన్నీలియోన్ కారణం అని చెప్పాడు. కాలేజీ చదివే రోజుల్లో సన్నీ లియోన్ బాగా ఫేమస్ కావడంతో తన ఫ్రెండ్స్ అందరూ తనను సన్నీ లియోన్, సన్నీ లియోన్ అని ఏడిపించే వారట. దీంతో వాళ్ళ బాధ పడలేక తన పేరుని అడవి శేష్‌గా మార్చుకున్నట్లు తెలిపాడు. 
 
హైదరాబాద్‌లో పుట్టిన అడవి శేషు అమెరికాలో పెరిగాడు. అక్కడ ఇండియన్ యాక్టర్స్ హాలీవుడ్ సినిమాలలో చిన్న పాత్రలకే పరిమితం కావడాన్ని గమనించాడు. అందువల్ల అక్కడ సినిమాలో నటించడం కష్టమని భావించి ఇండియాకు తిరిగి వచ్చాడు. 
Adavi Shesh
Adavi Shesh
 
ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. మేజర్, గూఢాచారి వంటి చిత్రాలతో భారతదేశం అంతటా పాపులర్ అయిన అడివి శేష్, రాబోయే రోజుల్లో "డకాయిట్" వంటి సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.