మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (13:20 IST)

సన్నీలియోన్ కన్నీళ్లు పెట్టుకుంది.. గతం మరిచిపోవాలనుకుంటే?

పోర్న్ కమ్ బాలీవుడ్ హీరోయిన్ అయిన సన్నీలియోన్ కన్నీళ్లు పెట్టుకుంది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్న సన్నీలియోన్.. ఓ టీవీ షోలో పాల్గొంది. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ''పించ్'' అనే లైవ్ టాక్ షోకు సన్నీ వెళ్లింది. సోషల్ మీడియాలో సెలెబ్రిటీలపై నెటిజన్ల కామెంట్లు, వారి ప్రశ్నలపై చర్చించడమే ఈ షో ప్రత్యేకత. 
 
ఈ సందర్భంగా ఓ నెటిజన్ చేసిన అభ్యంతరకర కామెంట్‌ను అర్భాజ్ ప్రస్తావించారు. దాంతో సన్నీ బోరున ఏడ్చేసిందట. అర్భాజ్ ఓదార్చుతున్నా ఆమె వెక్కి వెక్కి ఏడ్చిందట. పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని గడుపుతున్న తనను మళ్లీ పాత విషయాలనే గుర్తు చేస్తున్నాయని.. అవే మానసిక వేదనకు గురిచేస్తున్నాయని సన్నీ వెల్లడించినట్లు అర్భాజ్ తెలిపారు.