శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (12:02 IST)

బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో సన్నీలియోన్.. తిమ్మక్కకు కూడా చోటు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రంగాల్లో రాణించిన ప్రముఖులను పరిగణనలోకి తీసుకుని తయారు చేసిన బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో సన్నీకి చోటు దక్కింది. ఇంజనీర్లు, క్రీడారంగం, బిజినెస్, ఫ్యాషన్, సినిమా రం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రంగాల్లో రాణించిన ప్రముఖులను పరిగణనలోకి తీసుకుని తయారు చేసిన బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో సన్నీకి చోటు దక్కింది. ఇంజనీర్లు, క్రీడారంగం, బిజినెస్, ఫ్యాషన్, సినిమా రంగంలో రాణించే వారిని బీబీసీ ఎంపిక చేసింది. వారిలో వంద మందితో జాబితా సిద్ధం చేసింది.

ఇలా బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళలు-2016 జాబితాలో బాలీవుడ్ ప్రముఖ నటి, పోర్న్ స్టార్ సన్నీలియోన్ చోటు దక్కించుకుంది. 2013లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగిన సన్నీ ప్రభావ శీల మహిళల్లో ఒకరని బీబీసీ పేర్కొంది. 
 
సన్నీలియోన్‌తో పాటు గౌరీ చిందార్కర్(మహారాష్ట్ర), మల్లికా శ్రీనివాసన్ (చెన్నై), నేహా సింగ్(ముంబై) సాలుమారద తిమ్మక్క (కర్ణాటక) భారత్ నుంచి చోటు దక్కించుకున్న మహిళల్లో ఉన్నారు. 
 
ఇకపోతే.. తిమ్మక్క (కర్ణాటక) గత 80ఏళ్లలో 8వేలకు పైగా మొక్కలను నాటడం ద్వారా ప్రముఖ పర్యాణవేత్తగా ప్రసిద్ధి పొందారు. బీబీసీ 100మంది ప్రభావశీల మహిళల జాబితాలో తిమ్మక్కనే అత్యంత వృద్ధురాలు కావడం గమనార్హం.