సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 మార్చి 2018 (08:58 IST)

తస్మాత్.. జాగ్రత్త అంటూ అల్లుడిని హెచ్చరించిన రజనీకాంత్... (Video)

సూపర్ స్టార్ రజనీకాంత్ తన అల్లుడు తమిళ యంగ్ హీరో ధనుష్‌ను హెచ్చరించారు. తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇవ్వడంతో ధనుష్ బెదిరిపోయాడు. ఇంతకీ ఇలా వార్నింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఓసారి పరిశీలిస్తే,

సూపర్ స్టార్ రజనీకాంత్ తన అల్లుడు తమిళ యంగ్ హీరో ధనుష్‌ను హెచ్చరించారు. తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇవ్వడంతో ధనుష్ బెదిరిపోయాడు. ఇంతకీ ఇలా వార్నింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఓసారి పరిశీలిస్తే, 
 
రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "2.ఓ" (2.O). ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ కాగా, త్వరలోనే అధికారిక ట్రైలర్ విడుదల కావాల్సివుంది. ఇంతలోనే ఆ ట్రైలర్ లీకైంది. దీంతో షాక్ తిన్న చిత్ర యూనిట్... యూట్యూబ్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ టీజర్ యూ ట్యూబ్‌లో ప్రసారంకాకుండా అడ్డుకుంది. కానీ, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లలో ఈ లీకేజీ వీడియో చక్కర్లు కొడుతోంది. 
 
దీన్ని దృష్టిలో పెట్టుకుని రజనీకాంత్ తన అల్లుడు ధనుష్‌ను హెచ్చరించారు. ఎందుకంటే, రజనీకాంత్ హీరో ధనుష్ 'కాలా' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో లీకులపై జాగ్రత్తగా ఉండాలంటూ అల్లుడుని రజనీకాంత్ హెచ్చరించాడట.