గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మే 2022 (19:58 IST)

రజనీకాంత్ కొత్త సినిమా అప్‌డేట్... వచ్చే యేడాది సంక్రాంతికి...

rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్ తన కొత్త చిత్రం 166 గురించి తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తారు. 
 
అయితే, ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన "బీస్ట్" చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురిచేసింది. కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించినప్పటికీ ప్రేక్షకులతో పాటు హీరో విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు లోను చేసింది. దీంతో రజనీకాంత్ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తారా? లేదా? అనే సందేహం ఉత్పన్నమైంది. 
 
ఈ క్రమంలో ఈ చిత్రం అప్‌డేట్‌ వచ్చింది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలకానుంది. అదేసమయంలో విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం కూడా వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో వచ్చే యేడాది సంక్రాంతి బరిలో విజయ్, రజనీకాంత్ చిత్రాలు పోటీపడనున్నాయి.