శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 18 మే 2022 (18:33 IST)

జూన్ 10న విడుదలవుతున్న సురాపానం

Madhu Yadav,  Pragya Nayan
Madhu Yadav, Pragya Nayan
అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మాతగా సంపత్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ సురాపానం ( కిక్ & ఫన్ ) చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతుంది.
 
హీరో చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను ఎలా ఎదురుకున్నాడు అనే కథాంశాన్ని  థ్రిల్లింగ్ గా చూపిస్తూ హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని మలిచామని, సురాపానం ( కిక్ & ఫన్ ) చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని , జూన్ 10 వ  తారీఖున చిత్రాన్ని విడుదల చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.
 
ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రగ్యా నయన్ నటించగా ఇతర ముఖ్య పాత్రలలో అజయ్ ఘోష్, సూర్య , ఫిష్ వెంకట్ ,మీసాల లక్ష్మణ్ , చమ్మక్ చంద్ర , విద్యాసాగర్ , అంజి బాబు , మాస్టర్ అఖిల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించగా , ఫోటోగ్రఫీ : విజయ్ ఠాగూర్ , ఎడిటర్ : J P , పబ్లిసిటీ డిజైనర్ : ధని యేలె , పి. ఆర్. ఓ : మాడూరి మధు , మాటలు : రాజేంద్రప్రసాద్ చిరుత, సాహిత్యం : సురేష్ గంగుల, అలరాజు, దేవ్ పవర్, ఆర్ట్ : భూపతి యాదగిరి, కొరియోగ్రఫీ : సురేష్ కనకం,  నిర్మాత : మట్ట మధు యాదవ్,  క‌థ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సంపత్ కుమార్.