మంగళవారం, 15 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మార్చి 2025 (19:14 IST)

తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాను.. క్షమించండి : సుప్రీతి

surekha - supritha
సినీ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీతి క్షమాపణలు కోరింది. బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్‍ అమర్ దీప్ చౌదరితో కలిసి ఆమె ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తుంది. దీంతో పాటు ఫీలింగ్స్ విత్ సుప్రీత అనే టాక్ షో చేస్తుంది. తాజాగా హోలీ పండగ సందర్భంగా అభిమానులకు ఆమె శుభాకాంక్షలు తెలిపింది. దీంతో పాటు క్షమాపణలు కూడా కోరింది. అలాగే, సుప్రీతి తల్లి సురేఖ కూడా క్షమాపణలు చెప్పింది. 
 
సుప్రీతి స్పందిస్తూ తాను కూడా తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశానని చెప్పింది. ఇక నుంచి అలాంటి ప్రమోషన్లు చేయనని, మీకు కూడా బెట్టింగులకు దూరంగా ఉండాలని చెప్పింది. ఎవరూ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయొద్దని హితవు పలికింది. 
 
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు తనను క్షమించాలని సుప్రీతి కోరింది. బెట్టింగ్ యాప్స్‌‍ను అందరూ వెంటనే డిలీట్ చేయాలని చెప్పింది. సోషల్ మీడియాలో కూడా వాటిని ఫాలో కావొద్దని విజ్ఞప్తి చేసింది. 
 
కాగా, బెట్టింగ్ యాప్‌లను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్న వారిపై గత కొన్ని రోజులుగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలువురుపై కేసులు కూడా నమోదు చేశారు. దీంతో సుప్రీతి క్షమాపణలు చెప్పింది.