మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 20 జనవరి 2020 (19:20 IST)

రచ్చ రచ్చ చేస్తున్న సురేఖావాణి....

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సురేఖావాణికి తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరే ఉంది. ఫ్యామిలీ పాత్రలకు పెట్టింది పేరు. అక్కగా, అమ్మగా ఇలా రకరకాల క్యారెక్టర్లలో చేసి అందరినీ మెప్పించారు సురేఖావాణి. ప్రస్తుతం అవకాశాలు తక్కువగానే ఉన్నాయి సురేఖావాణికి. కానీ వెండితెరపై వేసే పాత్రలకు అపోజిట్‌గా తన ఇమేజ్‌ని సోషల్ మీడియాలో బిల్డప్ చేసుకుంటోంది సురేఖావాణి. 
 
తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేస్తూ రచ్చరచ్చ చేస్తోంది. తెరపైన చీరకట్టులో సాంప్రదాయంగా కనిపించే సురేఖా సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలను గుప్పిస్తోంది. అలాగే ఆ మధ్యన బికీనీ వేసుకుని స్విమ్మింగ్ పూల్‌లో దిగి తన అందాలను ప్రదర్సించింది సురేఖా.
 
ఆ ఫోటో కాస్త అప్పట్లో వైరల్ అయ్యింది. ఇప్పుడు రకరకాల డ్రెస్సులతో యువతను ఉర్రూతలూగించేలా ఆమె వేస్తున్న డ్రస్సులు.. తీసుకున్న ఫోటోలను చూసి కుటుంబ పాత్రల్లో చూసిన ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె చేస్తున్న పాత్రలు పెద్ద హీరోల సినిమాలే కావడంతో ఆమెకు బాగానే కలిసి వస్తోంది. దీంతో సురేఖా కాస్త తెగ ఆనందంతో ఖాళీగా ఉన్న సమయంలో ఇలా ఫోటోలను తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేసేస్తోందట.