బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (18:30 IST)

24 గంట‌ల్లో కాలర్ బోన్ కు శస్త్ర చికిత్స- సాయితేజ్ కోలుకోవాల‌ని హీరోలు ప్రార్థ‌న‌

Appolo doctros
సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం బాగానే వుంద‌ని అపోలో ఆసుప‌త్రి సాయంత్రం 6.10 నిముషాల‌కు తాజా హెల్త్ బుల్టెన్ విడుదల చేసింది. ఆయ‌న‌కు ఇంటర్నల్ గా ఎటువంటి గాయాలు లేవని వెల్ల‌డించింది. ఆయ‌న చికిత్స కు సహకరిస్తున్నారని డాక్ట‌ర్ల బృందం తెలియ‌జేసింది.
 
డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ చికిత్స కొనసాగుతున్నది. అయితే కాలర్ బోన్ కు శ‌స్త్ర చికిత్స అవ‌స‌రం అని తేల్చి చెప్పారు. 24 గంటలు తరువాత దాని గురుంచి చూస్తాం అని తెలియ‌జేశారు. 
 
కాగా, తేజ్ ఆరోగ్యం కుదుటి ప‌డి మ‌ర‌లా త‌మ‌తో ఆనందంగా తిర‌గాల‌ని యూత్ హీరోలంతా ఆకాంక్షించారు. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, మంచు విష్ణు, స‌త్య‌దేవ్‌, నాగ‌శౌర్య‌తోపాటు ప‌లువురు త‌మ స్నేహితుడు కోలుకోవాల‌ని ప్రార్థ‌న చేయాల‌ని అభిమానుల‌ను కోరారు.
 
శ‌నివారం ఉద‌యంనుంచే చిరంజీవి కుటుంబీకులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రికి వ‌చ్చారు. వీరి రాక‌కుముందే అభిమానుల తాకిడి ఎక్కువైంది. పోలీసులు అంద‌రినీ నియంత్రిస్తున్నారు.