గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 జులై 2022 (13:45 IST)

చెవిటివాడు, మూగ‌వాడుగా సూర్య‌!

Suriya poster
Suriya poster
త‌మిళ ద‌ర్శ‌కుడు బాల ద‌ర్శ‌క‌త్వంలో హీరో సూర్య న‌టిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ళ త‌ర్వాత వారి కాంబినేష‌న్ రాబోతోంది. అందుకే వీరి తాజా సినిమాపై భారీ అంచ‌నాలే వున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మొహానికి క్రాస్‌గా వున్న గోనెసంచెనుంచి సూర్య చూస్తున్న లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ర‌గ్‌డ్‌గా వున్న ఈ లుక్ మీసాల‌కు గాటు పెట్టుకున్నాడు.
 
కృతిశెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి `అచ‌లుడు` అని తెలుగులో టైటిల్ పెట్టారు. ద‌క్షిణాది భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని స్వీయ‌నిర్మాణంలో 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో నిర్మిస్తున్నారు. ఇందులో చెవిటివాడు, మూగ‌వాడుగా రెండు కోణాలున్న పాత్ర సూర్య పోషిస్తున్నాడ‌ని స‌మాచారం. దీనిపై త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌గ‌ల‌వు. ఈ చిత్రానికి జీవీ ప్ర‌కాష్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.