శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 28 నవంబరు 2015 (20:32 IST)

సిఎం రిలీఫ్‌ఫండ్‌కు సూర్య రూ.25 లక్షల సాయం... గొప్పోడు, పెద్దమనసు

తమిళనాట వర్షాలు బీభత్సం సృష్టించి ప్రజల్ని అతలాకుతలం చేస్తుంటే... ప్రముఖులు తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పుడు విశాల్‌ తర్వాత సూర్య అటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆయన తమిళనాడు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 25 లక్షలను విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇక ఈ వరదల వల్ల ఇబ్బందులకు గురైన ప్రజల సహాయార్థం ప్రభుత్వంతో పాటు పలు ఇతర స్వచ్చంద సంస్థలు కూడా సహాయ చర్యల్లో లీనమయ్యాయి.
 
ఇక ఈ సహాయ కార్యక్రమాలకు చేయూతగా నిలుస్తూ సూర్య రూ.25 లక్షల చెక్‌ను నడిగర్‌ సంఘం తరపున సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందజేశారు. వరద బాధితుల సహాయార్థం సూర్య ఇలా తనవంతుగా ముందుకు వచ్చి ఇంత మొత్తం అందజేయడం పట్ల సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.