గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (13:18 IST)

డీజే టిల్లు సీక్వెల్.. హీరోయిన్.. అనుపమనా..? శ్రీలీలానా?

SriLeela
డీజే టిల్లు సీక్వెల్ రాబోతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఒక రోజు శ్రీలీలా హీరోయిన్ అంటూ వార్తలు వస్తుంటే మరో రోజు అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది.
 
మొత్తానికి డీజే టిల్లు సీక్వెల్ విషయంలో ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి తాజాగా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత మరింతగా పెరుగుతుంది. ఈ సమయంలో హీరోయిన్ ఎవరు అనే విషయమై చెప్పకుండానే చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్‌ని శరవేగంగా చేస్తున్నారు. 
 
ఇటీవలే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది అంటూ ఒక చిన్న పోస్టర్‌ని కూడా హీరో సిద్దు జొన్నలగడ్డ విడుదల చేయడం జరిగింది.