మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 11 ఏప్రియల్ 2019 (17:46 IST)

ఎన్.జి.కే ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేస్తోంది

సూర్య - సెల్వ రాఘవన్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం ఎన్.జి.కే. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో సూర్య స‌ర‌స‌న‌ రకుల్, సాయిపల్లవి న‌టిస్తున్నారు. సెల్వ రాఘ‌వ‌న్ సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందుక‌నే ఈ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఆడియ‌న్స్‌లో ఆస‌క్తి ఏర్ప‌డింది. తెలుగు, తమిళ భాషల్లో మే 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని మసాలా సాంగ్‌ను తెలుగు, త‌మిళ్ రెండింటిలోను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.
 
ఈ నెల 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు మసాలా సాంగ్‌ను విడుదల చేయనున్నారు. వడ్డీలోడు వచ్చేనే.. అంటూ ఈ పాట సాగనుంది.  ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకునే సూర్య ఈ సినిమాతో తెలుగు, త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధిస్తాడేమో.