Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ సినిమాలు సక్సెస్ అయినప్పుడు నాదెందుకు కాదు: ఎస్3 లేట్‌పై సూర్య

హైదరాాబాద్, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (01:28 IST)

Widgets Magazine
Surya

విడుదల కావలసిన సినిమా దాదాపు వంద రోజుల పాటు విడుదల కాకుంటే ఎవరికైనా ముందుగా వచ్చే సందేహం.. ఆ సినిమాలో సరుకు ఉంటుందా అనేదే. కానీ తాను నటించిన ‘ఎస్‌3–యముడు3’ సినిమా వంద రోజులు ఆలస్యంగా విడుదల అవుతున్నా తనకు ఏ టెన్షనూ లేదంటున్నారు ప్రముఖ తమిళ హీరో సూర్య. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి చేసుకున్న మా సినిమాను దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ ఓసారి తమిళనాడు ముఖ్యమంత్రి మరణం, మరోసారి ‘జల్లికట్టు’.. తదితర కారణాల వల్ల సుమారు వంద రోజులు వాయిదా పడింది. విడుదల తేదీ ప్రకటించి, మళ్లీ మళ్లీ వాయిదా వేయడం వల్ల ప్రేక్షకుల్లో కన్‌ఫ్యూజన్‌ పెరుగుతుంది. కానీ, వాళ్లంతా ప్రేమ, గౌరవంతో సినిమాపై ఆసక్తితో ఉన్నారు. ‘సింగం’ సిరీస్‌కి హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ ఉండడం వల్లే ‘ఎస్‌ 3’పై క్రేజ్‌ ఉంది అంటూ వివరించారు సూర్య.
 
మరి వందరోజులు ఆలస్యంగా, అదీ పండుగ తేదీలు కాని సందర్భంలో సినిమా విడుదలైతే  వసూళ్లపై ఆ ప్రభావం ఉండదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ కథ బాగుంటే సినిమా ఎప్పుడు విడుదలైతే ఏంటి అటూ ధీమాగా చెప్పారు...  దీపావళికి విడుదలైతే 15 నుంచి 20 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చే ఛాన్సుందని ట్రేడ్‌ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు పండగ వాతావరణం లేదు. కానీ, ఫిబ్రవరిలో విడుదలైన కార్తీ ‘పరుత్తి వీరన్‌’, ‘యుగానికి ఒక్కడు’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కథ బాగుంటే సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్టే అనేశారు.. ‘సింగం’ సిరీస్‌ మీద ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం అలాంటిది అన్నారు. 
 
ఈరోజు ఐపీయస్‌ సీవీ ఆనంద్‌గారితో మాట్లాడితే... ప్రభుత్వ సహకారంతో బ్యాంకాక్‌ వెళ్లి కృషి బ్యాంక్‌ నిందితులను పట్టుకున్న వైనం గురించి చెప్పారు. ‘సింగం–2’లో ఆపరేషన్‌ ‘డి’ పేరుతో హీరో సౌతాఫ్రికా వెళతాడు. సినిమాల్లో చూపించినవి 80 శాతం రియల్‌ లైఫ్‌లో జరుగుతున్నాయి. మామూలుగా ఓ మనిషిని చెంపదెబ్బ కొట్టడానికి కూడా మన చట్టాలు ఒప్పుకోవు. కానీ, కమర్షియల్‌ యాక్షన్‌ పేరుతో ఓ 20 శాతం డ్రామా జోడించి, అర్థవంతమైన కమర్షియల్‌ సినిమాలు తీస్తున్నాం. సీవీ ఆనంద్‌ వంటి రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు (పోలీసులు) ‘సింగం’ చిత్రాలను గౌరవిస్తున్నారు. పోలీస్‌ ట్రైనింగ్‌ అకాడెమీలలో చూపించి ‘మీరూ ఇలా ఉండాల’ని చెబుతున్నారు. అవి విన్నప్పుడు ఎగై్జట్‌మెంట్‌ వస్తుంది అన్నారు సూర్య
 
సూర్య, అనుష్క, శ్రుతీహాసన్‌ ముఖ్య తారలుగా హరి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ‘సింగం–3’ని నిర్మాత మల్కాపురం శివకుమార్‌ తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈ నెల 9న ఈ సినిమా వస్తోంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అంధుడి పాత్రలో రవితేజ... చిత్ర విజయంపై దిల్ రాజు భరోసా

‘బెంగాల్‌ టైగర్‌’ వంటి హిట్‌ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్‌ తీసుకున్న రవితేజ ఇప్పుడు ...

news

నాగ్‌ను అలా చూసి ఎమోషన్ అయ్యా... కె.రాఘవేంద్ర రావు ఇంటర్వ్యూ

కమర్షియల్‌ సినిమాలు తీసిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఒక్కసారిగా భక్తి చిత్రాలు తీయడంలో ...

news

మాస్ మ‌హారాజా ర‌వితేజ - అనిల్ రావిపూడి చిత్రం 'రాజా ది గ్రేట్‌'

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ...

news

సామాన్యుడి సహనాన్ని పరీక్షించొద్దు.. శశికళకు కమల్ హాసన్ వార్నింగ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికళ నటరాజన్‌కు విశ్వనటుడు ...

Widgets Magazine