ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 జులై 2023 (13:11 IST)

ట్రాన్స్‌జెండర్ పాత్రలో సుస్మితాసేన్- తాలీ వెబ్ సిరీస్‌ ట్రైలర్ వైరల్

sushmitasen
1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న సుస్మితా సేన్ పలు చిత్రాల్లో నటించింది. దక్షిణాది సినిమాలతో పాటు  హిందీ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్ పరిశ్రమలో అగ్రనటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె వయస్సు 47 సంవత్సరాలు.  కొన్ని సంవత్సరాల క్రితం ఆమె ప్రముఖ మోడల్ రోహ్మాన్ షాల్‌తో ప్రేమాయణం నడిపింది. 
 
అయితే గత ఏడాది ఈ జంట విడిపోయినప్పటి నుండి, ఆమె దత్తత తీసుకున్న ఇద్దరు పిల్లలను పెంచడంపై దృష్టి సారించింది. ఇదిలా ఉంటే సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సుస్మితా సేన్ తాజాగా కొన్ని వెబ్ సిరీస్‌లలో మాత్రమే నటిస్తోంది. ప్రస్తుతం సుస్మితా సేన్ 'తాలీ' అనే వెబ్ సిరీస్‌లో ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటిస్తోంది. 
 
ముంబైలో నివసిస్తున్న లింగమార్పిడి వ్యక్తుల కోసం ఒక సామాజిక కార్యకర్త, శ్రీకౌరి సావంత్ జీవితం ఆధారంగా ఈ సిరీస్ రూపొందించబడింది. ఈ వెబ్ సిరీస్‌కు జాతీయ అవార్డు గ్రహీత రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంలో, సుస్మితా సేన్ తన సోషల్ మీడియా పేజీలో ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను రిలీజ్ చేసింది. సుస్మిత వాయిస్‌తో మొదలైన ఈ టీజర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.