గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 జులై 2022 (09:30 IST)

సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నా, పెళ్లెప్పుడో తెలీదు: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ

Sushmita-Lalit modi
మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ గురించి తెలియనివారు వుండరనుకోవచ్చు. విశ్వసుందరి కిరీటం గెలిచిన తర్వాత సినిమాలతో ఎంత బిజీ అయ్యిందో ప్రేమలు, డేటింగులతో కూడా అంతే బిజీ అయ్యింది. ప్రస్తుతం ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీతో డేటింగులో వుందట.


ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. మాల్దీవుల్లో హ్యాపీగా ఎంజాయ్ చేసాము, ఇప్పుడు కుటుంబంతో కలిసి లండన్‌లో వున్నామంటూ పోస్టు పెట్టడమే కాకుండా ఫోటోలు పోస్ట్ చేసాడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

 
సుస్మితా సేన్ ఇప్పటికే ఇద్దరితో డేటింగ్ చేసి పెళ్లి దాకా వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేసింది. తొలుత పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్ తో ప్రేమాయణం సాగించింది. పెళ్లి చేసుకుందామంటే అతడికి సుస్మిత దొరకలేదంట. అంటే... సినిమాలతో అంత బిజీ అయ్యేసరికి ఏం చేయాలో తెలియక బ్రేకప్ చెప్పేసాడు. ఆ తర్వాత ప్రముఖ మోడల్ రోహ్మాన్‌తో లవ్ కూడా బ్రేక్ అయిపోయింది. అది కూడా మూన్నాళ్ల ముచ్చటైంది. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి లలత్ మోడీతో కనెక్ట్ అయ్యింది.