సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (12:59 IST)

బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌కు గుండెపోటు

బాలీవుడ్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ గుండెపోటుకు గురైనట్టు వెల్లడించారు. దీంతో ఆమె యాంజియోప్లాస్టీ చేసుకున్నట్టు ఆయన తన ఇన్‌స్టాఖాతాలో వెల్లడించారు. "మీరు మనస్సుని సంతోషంగా, ధైర్యంగా ఉంచుకోండి. అది మీకు అవసరమైనపుడు అది అండగా ఉంటుంది. నేను రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యాను.

యాంజియోప్లాస్టీ చేయించుకున్నాను. స్టంట్ వేశారు. ముఖ్యంగా నా కార్డియాలజిస్ట్ నేను పెద్ద హృదయాన్ని కలిగివున్నానని మళ్లీ నిరూపించారు. ఈ పోస్ట్ కేవలం నా శ్రేయోభిలాషులకు నేను మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాననే శుభవార్త చెప్పడానికి మాత్రమే అని చెప్పారు. సకాలంలో స్పందించి నేను కోవడానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు అని చెప్పారు.