సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (16:34 IST)

బెల్లంకొండ గణేశ్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ "స్వాతిముత్యం"

Swathimuthyam
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతా తెరకెక్కిన చిత్రం "స్వాతిముత్యం". సితార బ్యానరుతో కలిసి త్రివిక్రమ్ ఈ సినిమాను నిర్మించారు. గణేశ్ సరసన వర్ష బొల్లమ్మ నటించారు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చగా, లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. దసరా కానుకగా అక్టోబరు ఐదో తేదీన విడుదలకానుంది. 
 
ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. హీరో హీరోయిన్ల మధ్య పరిచయం, అది ప్రేమగా మారడం, పెద్దలను ఒప్పించి పెళ్లి పీటల వరకు వెళ్లే ప్రయాణంలో భావోద్వేగంతో ఈ స్క్రిప్టు సాగుతుందనే విషయం ఈ ట్రైలర్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. కామెడీ, ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 
 
రావు రమేష్, నరేశ్, వెన్నెల కిషోర్, ప్రగతి, గోపరాజు, రమణ తదితరులు ఇతర పాత్రలో పోషించగా, యువతను, కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చిత్రాన్ని నిర్మించారు.