సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 జులై 2024 (16:10 IST)

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

Prabhas
టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డార్లింగ్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. 
 
మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ప్రభాస్ సక్సెస్ ద్వారా తెలుస్తుందన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు విజయం దక్కదని కొందరు అన్నారు. కానీ వారి అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అంతే జరుగుతుంది.
 
"ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకు ఉంటుంది. కానీ సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారు. ఇప్పటివరకు ఆయన ఆశించినవన్నీ జరిగాయి. మ్యారేజ్ కూడా జరుగుతుంది" అంటూ చెప్పుకొచ్చారు. 
 
ప్రభాస్ పెళ్లి గురించి శ్యామలాదేవి మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు డార్లింగ్ పెళ్లి గురించి వచ్చిన రూమర్స్‌పై స్పందించారు. అలాగే ఏ మూవీ ఈవెంట్స్ అయినా.. ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ మ్యారెజ్ గురించి ప్రశ్న రావడం.. శ్యామలాదేవి స్పందించడం జరుగుతుంది.