బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2019 (18:25 IST)

''సైరా'' ప్రమోషన్స్‌కు ఎందుకు రాలేదంటే? నయనతార లీక్

''సైరా'' ప్రమోషన్స్‌ వేడుకల్లో నయనతార పాల్గొనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ విమర్శలపై నయనతార స్పందించింది. తన పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి నయనతార ఊహించని విధంగా బ్రేక్ వేసింది. అంతేగాకుండా భవిష్యత్తులో తనను ఎవరూ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలను పిలవకుండా వుండేందుకు బ్రహ్మాస్త్రాన్ని వదిలింది. 
 
తను నటించే సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో పాలు పంచుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నయనతార లీక్ ఇచ్చింది. అంతేకాదు గతంలో తాను ఒక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్ళానని ఆ సినిమా డిజాస్టర్ అయ్యిందని.. ఆ తర్వాత తను తన సిమేమాల ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో పాలుపంచుకోవడం మానివేశానని క్లారిటీ ఇచ్చింది.
 
అయితే నయనతార 'సైరా' ప్రమోషన్‌కు రాకపోయినా ఆ మూవీ ఎందుకు కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేదని టాక్ వస్తోంది. మరి ఇందుకు నయనతార ఏం సమాధానమిస్తుందో. ''సైరా''లో నటించి నందుకు నయనతారకు నాలుగు కోట్ల పారితోషికం ఇచ్చిన సంగతి తెలిసిందే.