శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (13:18 IST)

సైరా మూవీలో సాంగ్స్ తో చిరు రికార్డ్... ఇంత‌కీ.. ఏంటా రికార్డ్..?

మెగాస్టార్ లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ భారీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. అక్టోబ‌ర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని మెగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే... పాట‌ల విష‌యంలో చిరు ఓ రికార్డ్ క్రియేట్ చేసారు.
 
ఆ... రికార్డ్ ఏంటంటే... ఒక చిత్రంలో ఐదు పాటల తప్పనిసరిగా ఉండేవి. ఈ  పద్ధతిని తెలుగు చిత్రనిర్మాతలు నెమ్మదిగా తగ్గించుకుంటున్నారు. పెద్ద బడ్జెట్‌తో కూడిన సైరా ధైర్యంగా తక్కువ పాటలను ఉపయోగిస్తోంది. ఈ సినిమాలో రెండు పాటలు మాత్రమే ఉన్నాయని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. చిరంజీవి కెరీర్‌లో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్న మొదటి చిత్రం ఇది.
 
చిరు సినిమా అంటేనే పాట‌లు, డ్యాన్సులు ఎక్కువ‌గా ఆశిస్తారు. ఇది చరిత్ర ఆధారంగా నిర్మించిన సినిమా కాబట్టి సంద‌ర్భానుసారంగా రెండు పాట‌లే పెట్టార‌ట‌. ఈ విధంగా త‌న సినిమాలో కేవ‌లం రెండు పాట‌లే ఉన్న సినిమాగా సైరాతో ఓ రికార్డ్ క్రియేట్ చేసారు మెగాస్టార్. మ‌రి.. రిలీజ్ త‌ర్వాత రికార్డులు ఎలా ఉంటాయో చూడాలి.