శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 29 మార్చి 2018 (15:25 IST)

ముదురు హీరో సరసన మిల్కీబ్యూటీ...

టాలీవుడ్‌లోని ముదురు హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయనకు మల్టీస్టారర్ చిత్రాలతో పాటు హీరోగా నటిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఈ ముదురు హీరోకు పెద్దగా అవకాశాలు రావడంలేదు. దీంతో కుర్ర హీరోలతో సైతం జ

టాలీవుడ్‌లోని ముదురు హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయనకు మల్టీస్టారర్ చిత్రాలతో పాటు హీరోగా నటిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఈ ముదురు హీరోకు పెద్దగా అవకాశాలు రావడంలేదు. దీంతో కుర్ర హీరోలతో సైతం జతకట్టేందుకు సై అంటున్నాడు.
 
ఈపరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'దిల్' రాజు నిర్మిస్తుంటే, అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి "ఎఫ్2 : ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్" అని పేరు పెట్టారు.
 
ఇందులో వెంకీ జోడీగా మిల్కీబ్యూటీ తమన్నా జతకట్టనుంది. నిజానికి ఈ భామకు కూడా ప్ర‌స్తుతం తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. ఇటీవ‌లి కాలంలో ఐటెం సాంగ్‌ల‌లో త‌ప్ప త‌మ‌న్నా పెద్ద‌గా తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. దీంతో సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం రావడంతో త‌మ‌న్నా ఎగిరిగంతేసి అంగీకారం తెలిపిందట. మ‌రో హీరో వ‌రుణ్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.