మ‌హేష్ సినిమాలో త‌మ‌న్నా... హీరోయిన్‌ని మార్చేసారా..?

tamanna
శ్రీ| Last Modified సోమవారం, 9 సెప్టెంబరు 2019 (14:51 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తుంది. అయితే.... ఈ
సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.... మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమాలో న‌టిస్తుంద‌ట‌.

అదేంటి ర‌ష్మిక క‌దా ఇందులో మ‌రి.. త‌మ‌న్నా ఏంటి... కొంప‌తీసి క‌థానాయిక‌ను మార్చేసారా అనుకుంటున్నారా..? మేట‌ర్ ఏంటంటే... ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా. రష్మిక ఈ సినిమాలో కథానాయిక. అయినా మరో అట్రాక్షన్ ఏదయినా వుండాలని అనుకున్నారట‌ డైరక్టర్ అనిల్ రావిపూడి.

అందుకే కాస్త సీనియర్ అయిన తమన్నాను తీసుకుంటున్నారు. త‌మన్నాను తీసుకుంది ఐటమ్ సాంగ్ కోస‌మో... స్పెషల్ సాంగ్ కోస‌మో కాద‌ట‌. ఇంట్రడక్షన్ సాంగ్ కోస‌మ‌ట‌. అవును... ఈ సాంగ్‌కు తమన్నాను తీసుకోవడం విశేషం. సినిమా ఆరంభంలో వచ్చే మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్‌లో తమన్నా కనిపించి, చిందేయబోతోంది. ఈ సాంగ్ కోసం తమన్నాని తీసుకోవాలా..? శృతి హాసన్‌ని తీసుకోవాలా..? అని బాగా ఆలోచించి ఫైన‌ల్‌గా త‌మ‌న్నానే ఓకే చేసార‌ని తెలిసింది.



దీనిపై మరింత చదవండి :