సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (10:29 IST)

హీరో విజయ్‌కి మద్రాసు హైకోర్టులో ఊరట

కోలీవుడ్ నటుడు విజయ్‌కి మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలు చేసిన విజయ్.. ట్రాక్స్ చెల్లించని కేసులో ఆయనకు ఊరట లభించింది. 
 
కారు కొనుగోలు ఎంట్రీ ట్యాక్స్‌ చెల్లించకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరుపుతూ నటులు ఇలా పన్ను ఎగవేతకు పాల్పడడం సమంజసం కాదంటూ ప్రత్యేక న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయ్‌ ఎంట్రీట్యాక్స్‌ చెల్లించారు. 
 
అయితే ప్రత్యేక న్యాయమూర్తి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను రద్దు చేయాలంటూ విజయ్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ శుక్రవారం జరిగింది. 
 
ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.