ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 మార్చి 2024 (08:34 IST)

ఆత్మహత్య చేసుకోబోతున్నా : తమిళ నటి వీడియో... నెట్టింట వైరల్

vijayalakshmi
తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు తమిళ నటి విజయలక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోను ఆమె మంగళవారం రిలీజ్ చేశారు. ఇందులోని సారాంశాన్ని పరిశీలిస్తే, "మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29వ తేదీన నేను ఒక వీడియో విడుదల చేశారు. నాన్ తమిళర్ కట్టి సమన్వయకర్త, సినీ దర్శకుడు సీమాన్ నాతా మాట్లాడాలని, నాతో కలిసి జీవించాలని కోరా. నేను ఎంతో ఆవేదనతో ఆ వీడియో పంపించా. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పా. 
 
ఇపుడు మార్చి 5వ తేదీ పూర్తియింది. నన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పి మూడేళ్లు అయింది. నాతో రహస్య జీవితాన్ని కొనసాగించారు. నా జీవితాన్ని నాశనం చేశారు. నన్ను నడిరోడ్డుపై పడేశారు. ఇపుడు నాకు ఎవరూ సహకరించడం లేదు. ఎవరైనా సహకరించినా వారిని తరిమి కొడుతున్నాడు. ఇపుడు కర్నాటకలో జీవించలేని పరిస్థితుల్లో ఉన్నా. ఇదే నా చివరి వీడియో. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా. కర్నాటక పోలీసులు తదుపరి వార్తలు చెబుతారు. నా మరణంపై సీమాన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది" అని ఆమె చెప్పారు.