వారిద్దరూ రాజకీయాల్లోకి రావాలంటున్న తమిళ కమెడియన్

గురువారం, 5 అక్టోబరు 2017 (13:54 IST)

vivek

తమిళ సినీ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్‌లిద్దరూ రాజకీయాల్లోకి రావాలంటూ తమిళ హాస్య నటుడు వివేక్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం చాలా సులభమని, కానీ నిలదొక్కుకోవడమే కష్టమన్నారు. 
 
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రజాబలమే శక్తిమంతమైనదన్నారు. రాజకీయం అనేది ఒక సేవ అని, దాన్ని గ్రహించిన నేతలు గతంలో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. తనకు రాజకీయాలు తెలియవన్నారు. కానీ, రాజకీయాల్లో లేకుండా సేవ చేయడం తెలుసన్నారు. ఇపుడు తాను అదే చేస్తున్నట్టు చెప్పారు.
 
తమిళ సూపర్‌స్టార్లు రజినీకాంత్‌, కమల్‌హాసన్‌లు రాజకీయాల్లోకి వచ్చినట్టయితే వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయాలని ప్రజల తరపున కోరుతున్నట్టు చెప్పారు. ప్రజలు కోరుకునే విధంగా పాలన అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవికి ఏఆర్ రెహ్మాన్ షాక్... 'సైరా'కు గుడ్ బై

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించనున్న 151వ చిత్ర యూనిట్‌కు ...

news

సమంత పెళ్లి నెక్లెస్‌పైనే ఊరూవాడా చర్చ!

చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇంట పెళ్లంటే ఊరువాడంతా సంబ‌ర‌మే. ఆ పెళ్లి గురించే పదేపదే ...

news

ఆ నటిపై మనసుపడిన రజనీకాంత్... నోరూరించే వంటకాలు చేయించారు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ నటిపై మనసు పారేసుకున్నాడు. ఆ హీరోయిన్ కోసం రుచికరమైన ఆహార ...

news

'జిల్' దర్శకుడు రాధాకృష్ణతో 'బాహుబలి' నెక్స్ట్ మూవీ

'బాహుబలి'తో జాతీయ స్టార్ అయిన ప్రభాస్ ఇపుడు... 'సాహో' సినిమాపైనే దృష్టి పెట్టారు. పక్కా ...