Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిన్న రైతులు.. నేడు నిర్మాతలు... టీవీ చానళ్ళకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దు.. విశాల్ ఆదేశం

గురువారం, 20 ఏప్రియల్ 2017 (08:53 IST)

Widgets Magazine
vishal

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన హీరో, నిర్మాత విశాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న కరవు కోరల్లో చిక్కుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలకు మేలుచేకూర్చేలా నిర్ణయం తీసుకోగా, ఇపుడు నిర్మాతలకు ఆదాయం అర్జించిపెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో సంచలనంగా మారింది. 
 
ప్రస్తుతం టీవీ చానెల్స్ శాటిలైట్‌ రైట్స్‌ వ్యవహారంలో చిన్న, పెద్ద చిత్రాలకు తారతమ్యం చూపుతున్నాయి. కానీ, తమ సినిమాల పాటలు, ట్రైలర్లు, క్లిప్పింగ్‌లను ఉచితంగా తీసుకుని భారీగా ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. ఇకపై టీవీ చానెల్స్‌కు ఏది కూడా ఉచితంగా ఇవ్వొద్దని నిర్మాతల సంఘం సభ్యులందరికీ విశాల్‌ సూచించారు. 
 
నిర్మాతలకు ఆదాయం సమకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కంటెంట్‌కు డబ్బులు చెల్లించాలని టీవీ చానళ్లను కోరామని నిర్మాతల సంఘం కార్యవర్గ సభ్యులు తెలిపారు. సినిమాలకు సంబంధించిన పాటలు, ట్రైలర్లు, క్లిప్పింగ్‌లతో టీవీ చానళ్లకు భారీ ఆదాయం వస్తున్నప్పుడు దానిలో కొంత నిర్మాతలకు ఇవ్వడంలో తప్పులేదని ఆయన చెప్పుకొచ్చారు. 
 
కాగా, తమిళనాట ప్రతి సినిమా టిక్కెట్‌‌పై ఒక రూపాయి రైతులకు కేటాయించాలని గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీనిని గతంలో నిర్మాతలు వ్యతిరేకించారు. ఇప్పటికే నష్టాల్లో ఉంటే మళ్లీ రైతులకు ప్రతి టికెట్‌లో ఒక రూపాయి ఇవ్వలేమని విశాల్‌కు సినీ నిర్మాతలు తెలిపారు. వారి బాధను అర్థం చేసుకొనే విశాల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. విశాల్ నిర్ణయం ఇపుడు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కన్నతండ్రి కమల్ హసన్ అయినా వేచి ఉండాల్సిందే..శ్రుతి అంత బిజీనా..

అన్నీ అనుకున్నట్లు జరిగితేనే సినిమా షూటింగులు సజావుగా సాగవు. ఇక ఏ కారణంవల్ల అయినా షూటింగ్ ...

news

మహానటిలో కీలకపాత్ర. ఇంకెవరిది.. అనుష్కదే..

భారతీయ చలనచిత్రరంగంలోనే ముగ్ధమనోహర్ అపరూప కథానాయకి సావిత్రి అని దేశమంతా ఒప్పుకున్న ...

news

గుండు కొట్టించుకున్నా... రూ.10 లక్షలు తీసుకుని రా... ముస్లిం పెద్దకు సోనూ నిగమ్ సవాల్...

ప్రముఖ గాయకుడు సోనీ నిగమ్ తనకు గుండు కొట్టించినవారికి రూ.10 లక్షలు ఇస్తానంటూ ఫత్వా జారీ ...

news

తెలుగు సినీ ఇండస్ట్రీ దుర్భరం... తమిళ సాంబార్ అమృతం... తెలుగు సాంబార్‌తో మోషన్స్...

ఆ నటుడికి ఇక్కడ ఏం చేదు అనుభవం వున్నదో కానీ తెలుగు సినీ ఇండస్ట్రీ మీద, తెలుగు వారి మీద ...

Widgets Magazine