శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (12:29 IST)

బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరుగా నమిత నియామకం

సినీ ఇండస్ట్రీలో సెక్స్ బాంబ్‌గా పేరుగాంచిన నటి నమిత. ప్రస్తుతం ఈమె పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమైంది. ఈ క్రమంలో ఆమె తన రెండో ఇన్నింగ్స్‌గా రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు పక్కా ప్రణాళికను రచించుకుంది. ఇందులోభాగంగా, భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించగా, ఇపుడు ఆ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీలో సభ్యురాలిగా నియమితులైంది. 
 
ఈ నియామకంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ, మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. తన దృష్టంతా రైతు సమస్యలపై కేంద్రీకరిస్తానని చెప్పారు. తమిళనాడు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన ఒక్క బీజేపీ మాత్రమే అందించగలదన్నారు. 
 
కాగా, నమితకు పార్టీ పదవి దక్కడంతో ఆమె అనుచరులు, అభిమానులు కోవిడ్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా, స్థానిక టి నగర్‌లోని పార్టీ కార్యాలయానికి గుంపులు గుంపులుగా వచ్చి స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు.